ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / నల్లగొండ జిల్లా : ఇది ఓ తల్లికి మాత్రమే సాధ్యమయ్యే త్యాగం...ఇది ఓ మమతామయురాలే చేసే పనికాదు – ఒక అచంచలమైన ప్రేమకు ప్రతిరూపం.తాను చనిపోయిన తర్వాత కూడా పిల్లలకు కష్టపెట్టొద్దని ఆలోచించి ముందే డబ్బులు దాచుకున్న తల్లి…చివరలో చనిపోయే ముందు “ఇవి నా చావు ఖర్చు” అంటూ చూపించి కన్నుమూసింది.ఆమె పేరు లక్ష్మమ్మ… వయస్సు సుమారు 75 ఏళ్లు. ఈ సంఘటన నల్గొండ జిల్లాలోని నార్కెట్‌పల్లి మండలంలోని మాండ్ర గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... చిన్నప్పటి నుంచి లక్ష్మమ్మ జీవితం అంతా కష్టాలతో నిండి ఉంది.చిన్ననాటి నుంచే ఉపాధి కోసం పోరాడిన ఆమె…పెద్దయ్యాక వ్యవసాయ కూలిగా, ఇళ్లలో పని మనిషిగా పని చేసింది.తన భర్త మరణించిన తర్వాత చిన్నపిల్లల్ని పెంచడం ఆమె బాధ్యత అయింది. పిల్లలకి చదువు చెప్పాలని ఎన్నో త్యాగాలు చేసింది.తన ఆరోగ్యం కోల్పోయినా, పిల్లల భవిష్యత్తు కోసమే బతికింది.అయితే తన చావుకు తానే సిద్ధమైంది...గత కొంతకాలంగా లక్ష్మమ్మ అనారోగ్యంతో బాధపడుతోంది.వయసు మీద పడిన ఆమెకు నడవడం, పనులు చేయడం కష్టమయ్యే స్థితికి వచ్చింది. అయినా కూడా తన సొంత అవసరాలకు ఎవరినీ అడగకుండా, పెన్షన్ వచ్చిన ప్రతిసారి కొంత డబ్బు దాచుకుంటూ వచ్చింది.తాను చనిపోయినప్పుడు కుమారుడికి భారం కాకూడదని తలచిన ఆమె…తన దిండులో ఆ డబ్బులను చక్కగా పెట్టుకుంది.తన కుమారుడితో చివరిసారిగా మాట్లాడిన సమయంలో,నన్ను అంతిమ యాత్రకు పంపించడానికి ఇవి సరిపోతాయ...రా బాబు” అంటూ తన దిండు చూపించిన ఆమె…కన్నీటి లోకంలోకి వెళ్లిపోయింది. అయితే ఈ వేధన అక్కడే ఆగలేదు… ఆమె కుమారుడు దిండులోని డబ్బు తీసి చూసాడు.అందులో పాత రూ.500, రూ.1000 నోట్లు ఎక్కువగా ఉన్నాయి.నోట్ల రద్దు జరిగినప్పటికీ లక్ష్మమ్మకు ఈ విషయం తెలియలేదు. ఆమె దాచిన డబ్బులు చెలామణి అవ్వని నోట్లు కావడం కుటుంబాన్ని మరింత బాధకు గురిచేసింది.తల్లి తాను మిగిలి పోవడానికి కాదు, వెళ్లిపోవడానికి డబ్బు దాచింది… కానీ ఆ డబ్బు ఆమెకే పనికిరాలేదు” అనే ఆవేదన కుటుంబ సభ్యులంతటినీ కమ్మేసింది. ఈ ఘటన పలువురిని కన్నీటి పర్యంతం చేసింది.
గ్రామస్తుల గుండెల్ని తడిపిన సంఘటన....
ఈ సంఘటన తెలిసిన ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆమె త్యాగానికి, ప్రేమకు జోహార్లు చెబుతున్నారు.గ్రామస్తులు, చుట్టు పక్కలవారు ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు వచ్చారు.తమ జీవితాల్లో ఇలాంటి తల్లి ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేమని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమాల్లో స్పందన....
ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇది తల్లి ప్రేమ అంటే ఏమిటో చూపించే ఉదాహరణ” అని తన మరణానికి తానే ఖర్చును భరించుకోవాలనుకుంది.ఇది తల్లి గొప్పతనం”నోట్ల రద్దు విషయం ఆమెకు తెలియకపోవడం బాధాకరం” అంటూ పోస్టులు వస్తున్నాయి. దీంతో పలు సంస్థలు లక్ష్మమ్మ త్యాగాన్ని గుర్తిస్తూ గ్రామంలో ఆమెకు జ్ఞాపికగా ఓ బస్టాండ్, చెక్కిలేని నామఫలకం ఏర్పాటు చేయాలంటూ ప్రజలు కోరుతున్నారు. అయితే ఈ సంఘటన మనకెందుకు కావాలి అంటే...పెద్దవారిని పట్టించు కోవడంలో మనం ఎంత తక్కువగా ఉన్నామో గుర్తించడానికి నిదర్శనంగా చెబుతుంది. వారికి మనం చేయాల్సిన విషయాలను అంత సాధారణమైన నోట్ల రద్దును కూడా చేరవేయలేకపోయిన మన తప్పు ఇది.ఒక్కసారి ఆమెకు వివరించి ఉండి ఉంటే, ఆమె చివరి కోరిక అసంతృప్తిగా ఉండేది కాదు.తల్లి అనగానే ఆప్యాయత గుర్తుకొస్తుంది.కానీ “తానొస్తున్న మృత్యువునూ ముందే అంచనా వేసి, దానికి ఖర్చును కూడా సిద్ధం చేసుకుని, తన కుటుంబాన్ని కష్టపెట్టకూడదని తలచిన తల్లి” – ఇది ఆప్యాయత కాదు, త్యాగంలో తుది మెట్టు అని పలువురు కొనియాడుతున్నారు.నల్గొండ జిల్లా మాండ్ర గ్రామానికి చెందిన లక్ష్మమ్మ లాంటి తల్లుల వల్లే ఈ సమాజం మానవతను ఇంకా నిలుపుకోవగలుగుతోందని పలువురు మేధావులు భావిస్తున్నారు.
Admin
Aakanksha News