Saturday, 26 September 2026 07:19:29 AM

నిర్మల్ జిల్లా అల్లంపల్లిలో ట్రాక్టర్ బోల్తా – డ్రైవర్ మృతి...

Date : 12 July 2025 06:24 AM Views : 529

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / నిర్మల్ జిల్లా : నిర్మల్ జిల్లా కడెం మండలంలోని అల్లంపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం గ్రామానికి చెందిన పేల్యరావ్ సింగ్ అనే వ్యక్తి కేజీ వీల్ ట్రాక్టర్ నడుపుతూ మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం, పేల్యరావ్‌ సింగ్ అదే గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో కేజీవీల్ తో పని చేస్తున్న సమయంలో ట్రాక్టర్ అదుపుతప్పి బురదలో మునిగి బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ కింద చిక్కుకుని ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పేల్యరావ్‌ సింగ్‌కు భార్యతో పాటు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :