Tuesday, 11 August 2026 02:13:22 PM

గుడిలో మహిళపై తొమ్మిది మంది అత్యాచారం...

Date : 14 December 2024 05:34 PM Views : 865

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / ఆకాంక్ష డెస్క్ : అస్సాలోని గౌహతి ప్రాంతంలో దారుణం వెలుగులోకి వచ్చింది. బోరాగఢ్‌లో ఓ మహిళపై తొమ్మిది మంది సామూహిక అత్యాచారం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వాట్సప్ గ్రూపులలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి తొమ్మిది మంది అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నవంబర్ 17న నిజారాపార్ ప్రాంతంలోని దుర్గ గుడి సమీపంలో మహిళపై తొమ్మిది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. డిసెంబర్ 12న వాట్సాప్ గ్రూపులలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులు కుల్దీప్ నాథ్(23), బిజయ్ రాభా(22), పింకుదాస్(18), గగన్ దాస్(21), సౌరవ్ బోరో(20), మ్రినాల్ రాభా(19) ఆరుగురిని అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :