Monday, 10 August 2026 04:27:24 PM

మద్యం మత్తులో కానిస్టేబుల్ పై యువకుడు దాడి...

Date : 02 February 2025 08:24 PM Views : 449

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / హైదరాబాద్ : మద్యం మత్తులో ఓ వ్యక్తి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ పై దాడి చేసి ట్యాబ్ లాక్కొని హల్చల్ చేసిన సంఘటన హైదరాబాద్ లోని మధుర నగర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మద్యం మత్తులో ఉన్న ఓంసింగ్ అనే యువకుడు తన తల్లిదండ్రులతో గొడవ పడుతున్న సమయంలో తండ్రి సంజయ్ సింగ్ డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉండగా నవీన్ గౌడ్ అనే కానిస్టేబుల్ పై మద్యం మత్తులో ఉన్న ఓంసింగ్ అనే యువకుడు దాడి చేయడంతో పాటు కానిస్టేబుల్ చేతిలో ఉన్న ట్యాబ్ ను లాక్కొని విసిరేశాడు. ఘర్షణలో కానిస్టేబుల్ కంటిపై గాయమైంది. దీంతో నిందితుడు ఓంసింగ్ పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :