Wednesday, 11 February 2026 09:38:35 PM

భార్యని హత్య చేసిన భర్త అరెస్ట్

Date : 14 July 2023 06:53 PM Views : 834

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / మంచిర్యాల జిల్లా : గత రెండు రోజుల క్రితం చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో చిత్తుగా మద్యం సేవించి ఇంటికి వెళ్లి కూర విషయంలో భార్యతో గొడవ పడి తన ఇంటిలో ఉన్న గొడ్డలితో భార్య మెడపై నరకగా అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే భార్యను హత్య చేసి పరారీలో ఉన్న భర్త గాలిపెల్లి పోచంను నమ్మదగిన సమాచారం మేరకు నిందితుడిని కిష్టంపేట శివారులోని సుద్దాల క్రాస్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి హత్యకు ఉపయోగించిన గొడ్డలిని,రక్తపు మరకలు ఉన్న చొక్కాని స్వాధీనం చేసుకోని కోర్టులో ప్రవేశ పెట్టడం జరిగిందని సీఐ వాసుదేవరావు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :