ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / నాగర్‌కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో బుధ వారం వైజంక్షన్ సమీపంలో అదుపుతప్పి కారు బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ నుంచి అచ్చంపేటకు వస్తుండగా అదుపుతప్పి కారు బోల్తా పడింది. ఈ సంఘటనలో ఇద్దరు గాయపడ్డారు. అచ్చంపేటకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Admin
Aakanksha News