ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / ఆసిఫాబాద్ జిల్లా : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భూమి సమస్యపై న్యాయం కోరుతూ తిరుగుతున్న మొగడ్ దగడ్ గ్రామానికి చెందిన మంగళ బాయి అనే భూ బాధితురాలు అధికారుల చేత అవమానానికి గురయ్యారు.గత నాలుగు సంవత్సరాలుగా తహసీల్దార్ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్, కలెక్టర్ కార్యాలయం, ఐటిడిఏ ఉట్నూర్ పీవో కార్యాలయాల్లో తన భూమి సమస్యకు పరిష్కారం కోసం తిరుగుతున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయాన్ని మళ్లీ సందర్శించిన మంగళ బాయి, ఆర్టీఐ దరఖాస్తు ద్వారా న్యాయం కోరతానని చెప్పిన సమయంలో, అక్కడ విధులు నిర్వర్తిస్తున్న కొంతమంది అధికారులు ఆమెను హేళన చేస్తూ మాట్లాడినట్టు సమాచారం. మీరు మా కార్యాలయానికి రాకండి... మీ సమస్య మా పరిధిలోకి రాదు... దరఖాస్తు ఎక్కడ పెట్టారో అక్కడే వెళ్లండి..." అంటూ ఆమెను అవమానపరిచారని ఆమె వాపోయారు.అధికారుల ధోరణి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన మంగళ బాయి, “నన్ను అవమానించిన అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలని, తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె కోరుతున్నారు. ఈ ఘటనపై బాధితురాలి వేదనను గమనించి ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, బాధ్యతా యుతంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Admin
Aakanksha News