ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / మహబూబ్‌నగర్ జిల్లా : మహబూబాబాద్: ఖమ్మం–వరంగల్ జాతీయ రహదారిపై మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలంలోని ఎల్లంపేట స్టేజ్ వద్ద శుక్రవారం (జూలై 4) తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నాడు.వివరాల్లోకి వెళ్తే, విజయవాడ నుండి పౌల్ట్రీ మెటీరియల్ లోడ్‌తో గుజరాత్‌కు వెళ్తున్న ఒక లారీ, వరంగల్ నుండి ఖమ్మం వైపు గ్రానైట్ లోడ్‌తో వస్తున్న మరో లారీ వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఢీకొన్న వెంటనే ఒక లారీ క్యాబిన్‌లో మంటలు చెలరేగి ముగ్గురు వ్యక్తులు అందులోనే సజీవదహనమయ్యారు. మరో వ్యక్తిని తీవ్ర గాయాలతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అనంతరం క్యాబిన్‌లో చిక్కుకుపోయిన మృతదేహాలను బయటకు తీసి మార్చురీకి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.ఈ ప్రమాదం కారణంగా ఖమ్మం–వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉదయం గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి చర్యలు తీసుకున్నారు. ఘటనా స్థలంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
Admin
Aakanksha News