ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / మహబూబ్‌నగర్ జిల్లా : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ శివారులో మానవత్వాన్ని మరిచిపోయేలా ఓ మైనర్ బాలుడు చేసిన అఘాయిత్యంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. కేవలం ఏడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన స్థానికంగా తీవ్ర ఆవేదనను కలిగిస్తోంది.శనివారం తల్లితో కలిసి కట్టెల కోసం వెళ్ళిన బాలికను, అదే ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలుడు పొదల్లోకి లాక్కెళ్లాడు. అనంతరం బాలిక నోట్లో గుడ్డలు కుక్కి, ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఘటన అనంతరం ఎవరికైనా చెప్పితే చంపేస్తానంటూ బాలికను బెదిరించాడు. అయితే కడుపునొప్పితో బాధపడుతున్న బాలికను ఆమె తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యంలో భాగంగా జరిగిన విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఆ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడు మైనర్ కావడంతో జువైనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.ఇలాంటి ఘటనలు మానవ సమాజంలో అసహనానికి, ఆవేదనకు కారణమవుతున్నాయని, పిల్లల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Admin
Aakanksha News