Tuesday, 11 August 2026 01:46:08 PM

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కు మరో యువకుడు బలి.. తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య

బెట్టింగ్ యాప్ లలో సుమారు రూ.30 లక్షలు కోల్పోయిన యువకుడు

Date : 11 January 2025 11:16 AM Views : 1003

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / వరంగల్ జిల్లా : సమాజంలో పెరిగిన టెక్నాలజీని కొందరు తమకు అనుకూలంగా మార్చుకొని మోసాలకు పాల్పడుతుంటే, మరి కొందరు అక్రమ సంపాదనే ద్వేయంగా మోసాలకు పాల్పడటంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లకు బానిసలుగా మరి అప్పుల పాలై ఎంతో మంది యువకులు ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలను తీసుకుంటున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. వరంగల్ జిల్లా వర్థన్న పేట మండలం ఇల్లంద గ్రామంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. వివరాల్లోకి వెళ్తే..ఇల్లంద గ్రామానికి చెందిన రాజ్ కుమార్ ఆన్ లైన్ బెట్టింగ్ కు బానిసై రూ.30 లక్షలు నష్టపోవడంతో రుణాలను ఎలా తీర్చాలని తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.బెట్టింగ్ యాప్ లలో రాజ్ కుమార్ సుమారు రూ.30 లక్షలు కోల్పోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :