Friday, 05 December 2025 04:08:42 AM

ఈయన సర్కిల్ సీఐ కాదు... సరసాల సీఐ..

మహిళను వేధింపులకు గురి చేసిన ఘటనలో సీఐ సస్పెండ్...

Date : 14 February 2025 02:47 PM Views : 512

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / విశాకపట్నం జిల్లా : ఈయన సర్కిల్ సిఐ కాదు.. సరసాల సీఐ.. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు భరోసానిచ్చి భద్రత కల్పించాల్సిన ఓ ఖాకీ కామాంధుడిగా మారాడు.. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ పోలీసు వ్యవస్థకే మచ్చ తీసుకువచ్చే విధంగా వ్యవహరించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మడకశిర పోలీసు స్టేషన్ లో సీఐ రాగిరి రామయ్య.. ఓ మహిళను వేధింపులకు గురిచేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన సంగతి విదిమే. తాజాగా ఈ కేసులో మడకశిర సీఐ రాగిరి రామయ్యను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనపై బాధితురాలు డీఐజీ, ఎస్పీలకు ఫిర్యాదు చేయడంతో అధికారులు సీఐపై సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.వివరాల్లోకెళితే..బంధువుల గొడవపై స్టేషన్‌కు వెళ్లి­న తనతో మడకశిర సీఐ రాగిరి రామయ్య అసభ్య­కరంగా మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకో­వాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీకి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఆమె వీడియో ద్వారా తనకు జరిగిన అవమానాన్ని వివరించింది. ఎస్పీ వెంటనే స్పందించి సీఐ రామయ్యపై విచారణ జరపాలని మహిళా పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీని ఆదేశించారు.టీడీపల్లి తాండాలో ఇంటికి సమీపంలోనే ఉన్న తన బంధవులు పొలం హద్దుల విషయంలో శుక్రవారం గొడవ పడ్డారని తెలిపింది. ఈ వివాదం వారికి సర్ది చెప్పాలని ఆమె పోలీస్‌ స్టేషన్‌కు వారిని తీసుకువెళ్లింది. సీఐ రాగిరి రామయ్య వద్దకు వెళ్లి రాజీ పడతామని, కేసు లేకుండా చేయాలని కోరినట్లు తెలిపింది. అయితే, సీఐ ఆ గొడవను పట్టించుకోకుండా రాత్రి 10 గంటల సమయంలో తనను ఒక్కదానినే చాంబర్‌లోకి పిలిచి అవమానకరంగా మాట్లాడారని తెలిపింది.నీ భర్త ఏం చేస్తున్నారు? ఎలా విడిపోయారు? ఫ్యామిలీని ఎలా పోషిస్తావు? ఒంటరిగా ఎలా ఉంటున్నావు? ఏదైనా బిజినెస్‌ చేయి.. నేను సపోర్టు చేస్తా. నేను చాలా మంచి ఆఫీసర్‌ని’ అంటూ అసభ్యకరంగా మాట్లాడారని, తనను భయబ్రాంతులకు గురిచేశా­రని వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే తన స్నేహితుడు రామాంజనేయలుకు ఫోన్‌ చేయగా వారు స్టేషన్‌కు వచ్చి సీఐని నిలదీశారని దీంతో ఇంటికి పంపించారని చెప్పింది.విచారణ పేరుతో సీఐ తనను ఎంతలా భయ­బ్రాంతులకు గురిచేశారో సీసీ కెమెరాల ఆధారంగా పరిశీలించి, ఆయనపై చర్యలు తీసుకో­వా­లని ఎస్పీ రత్నను కోరినట్లు తెలిపింది. సీఐ రామయ్య నుంచి రక్షణ కల్పించాలని కోరినట్లు చెప్పింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తాజాగా సీఐని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :