Tuesday, 11 August 2026 12:37:09 PM

సాగర్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం

Date : 02 May 2023 03:51 PM Views : 1198

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / హైదరాబాద్ : రాంగోపాల్‌పేట్‌ పోలీసులు ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని వెలికితీశారు. పెట్రోలింగ్‌లో ఉన్న లేక్‌ పోలీసులకు సాగర్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం తేలియాడుతున్నట్లు సమాచారం రావడంతో డీఆర్‌ఎఫ్‌ బృందాల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలికి 25నుంచి 30 ఏళ్ల వయస్సు ఉంటుందని ఒంటిపై క్రీం కలర్‌ టాప్‌, ఎరుపు రంగు ప్యాంటు ధరించి ఉందని పోలీసులు తెలిపారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే 040-27853595 9948031574 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :