Friday, 25 September 2026 04:18:39 AM

బెదిరింపులకు పాల్పడిన దాసరి విజయ్ పై కేసు నమోదు...

Date : 21 December 2025 09:02 PM Views : 623

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : అక్రమంగా కూల్చివేతకు పాల్పడిన దాసరి విజయ్ అనే వ్యక్తిపై గోదావరిఖని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. వివరాల్లోకి వెళ్తే... పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని ఉన్న దుకాణానికి చెందిన సిరిశెట్టి మల్లేష్ అనే వ్యక్తిని బెదిరించి భయభ్రాంతులకు గురిచేసి దుకాణ సముదాయాన్ని ప్రైవేట్ జెసిబిలతో కూల్చి వేయడంపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాసరి విజయ్ పై సెక్షన్ 329(3), 324(4), 351(2), బీఎన్ఎస్ కింద పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఎమ్మెల్యే పేరుతో బెదిరింపులకు గురి చేయడమే కాకుండా అన్ని అనుమతులతో గత 30 ఏళ్లుగా జీవన ఉపాధి పొందుతున్న దుకాణ సముదాయాన్ని కూల్చి వేసిన ఘటనపై బాధితులు, స్థానిక నాయకులు ప్రజలతో కలిసి కూల్చివేసినచోట నిరసన కార్యక్రమానికి దిగారు. దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాసరి విజయ్ పై పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :