Saturday, 26 September 2026 06:25:16 AM

బెంగళూరులో గోదావరిఖని యువతీ హత్య...

Date : 07 June 2023 11:24 AM Views : 726

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / గోదావరిఖని : ఎన్నో కష్టాలను భరిస్తూ ఉన్నత చదువులను చదివించిన తన కూతురు బంగారు భవిష్యత్తు కోసం కలలు కని తన కూతురిని విగత జీవిగా చూసిన తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.వివరాల్లోకి వెళ్తే...బెంగళూరు నగరంలోని జీవన్ భీమా నగర్ లో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మేదర్ బస్తికి చెందిన ఆకాంక్ష (23)లు అనే యువతి బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుండగా ఢిల్లీకి చెందిన అర్పిత్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి బెంగళూరులో ఓకే గదిలో ఉంటూ రెండు సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు.అయితే తన గదిలో మృతి చెంది ఉండడంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే తనతో పాటు గదిలో ఉండే ఢిల్లీకి చెందిన తన స్నేహితుడే ఆకాంక్షను హత్య చేసినట్లు సమాచారం. దీంతో హత్యకు గురైన ఆకాంక్ష మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గోదావరిఖనికి తీసుకోవచ్చారు. మృతదేహం వద్ద తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :