Monday, 10 August 2026 04:07:40 PM

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న జిగేల్ రాణీ భాధితులు....

పోలీసుల విచారణలో బయటపడుతున్న షాకింగ్ విషయాలు.... ⁉️

Date : 09 October 2024 08:01 AM Views : 764

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / విశాకపట్నం జిల్లా : విశాఖ హనీట్రాప్ కేసులో షాకింగ్‌ విషయాలు బయటకొస్తున్నాయి. జిగేల్ రాణీ భాధితులు పుట్టగొడుల్లా పుట్టుకోస్తు ఉండటంతో పోలీసులు సైతం ఆచార్యానికి గురవుతున్నారు. 27 ఏళ్ల యువతీ తన అందమే పెట్టుబడిగా సంపన్న వర్గాలే టార్గెట్‌ గా ముగ్గులోకి దింపడానికి బిజినెస్ పేరుతో డిజిటల్‌ మార్కెటింగ్ చేస్తున్నానంటూ డబ్బున్న యువకులను పరిచయం చేసుకుని ట్రాప్‌ చేస్తున్నట్లు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే..అయితే ఇప్పుడు ఈ కేసులో ఎన్నో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. మేము జిగేల్ రాణీ భాధితులమేనంటూ పలువురు పోలీస్ స్టేషన్‌కు క్యూ కడుతుండటంతో పోలీసులు అవక్కవుతున్నారు. ఈ కిలాడీ అరెస్ట్‌ కావడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. దీంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ముమ్మర దర్యాప్తును ప్రారంభించిన్నట్లు తెలుస్తోంది.హైదరాబాద్‌ కేంద్రంగానే ఈ హనీట్రాప్‌ ముఠా నెట్‌వర్క్‌ నడిపిస్తున్నట్లు పోలీసులు ప్రాధమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. హైదరాబాద్‌‌‌‌లో కూడా పలువురు యువకులను కూడా ట్రాప్‌‌‌‌ చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్ పోలీసులకు విశాఖ సీపీ బాగ్చి సమాచారం అందించారు. నిందితురాలి బ్యాంకు ఖాతాల్లోని క్యాష్‌‌‌‌ను ఇప్పటికే ఫ్రీజ్ చేశారు.ఆమె ఆన్‌లైన్ లావాదేవీల‌పై నిఘా పెట్టారు. న‌గ‌దు లావాదేవీల‌పైనా ఆరా తీస్తున్నారు.ఈ కేసులో ఎవరిని వదిలిపెట్టబొమని ఇప్పటికే బాధితుల నుంచి ఎద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయని.. మరికొందరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :