Sunday, 10 May 2026 07:22:36 AM

ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిన మహిళ చికిత్స పొందుతూ మృతి...

❇️ సకాలంలో స్పందించి ఆస్పత్రికి తరలించిన వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనరెడ్డి...

Date : 08 November 2025 07:21 AM Views : 725

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ మహిళ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... సింగరేణి మెడికల్ కాలేజ్ ఎదురుగా ఉన్న చెట్ల పొదల్లో ఓ మహిళ పెట్రోల్ పోసుకొని మంటలు అంటించుకుంది. అగ్నికి ఆహుతవుతూ బాధతో అరుస్తున్న ఆ మహిళను గమనించిన మెడికల్ కాలేజ్ విద్యార్థులు వెంటనే గోదావరిఖని వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనరెడ్డికి సమాచారం అందించారు. దీంతో సమాచారం అందుకున్న సీఐ ఇంద్రసేనరెడ్డి తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఆ మహిళ సగం కాలిన శరీరంతో ప్రాణాపాయస్థితిలో అక్కడ పడి ఉండగా, తక్షణమే ఆయనే స్వయంగా తన సిబ్బందితో కలసి ఆ మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందింది. మృతి చెందిన మహిళపై గోదావరిఖని టూ టౌన్ లో మిస్సింగ్ కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది. 1టౌన్ సీఐ ఇంద్రసేనరెడ్డి చూపిన మానవతా స్పూర్తి, సమయస్ఫూర్తి స్థానికుల ప్రశంసలను పొందింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :