Wednesday, 23 September 2026 11:22:47 AM

ఆలయంలో చోరీ .. పంచలోహ విగ్రహాలు అపహరణ...

Date : 22 March 2025 12:17 PM Views : 497

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : మక్తల్ పట్టణంలోని న్యూ రాఘవేంద్ర కాలనీలో ఉన్న శ్రీ జగద్గురు తింతిని మౌనేశ్వరా స్వామి దేవాలయంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దొంగలు చొరబడి చోరీ పాల్పడ్డారు. శనివారం ఉదయం ఆలయం తెరవడానికి పూజారి బాలకృష్ణ చారి వచ్చిన సమయంలో తలలు పగలకొట్టి ఉండటాన్ని గమనించి వెంటనే ఆలయ ప్రధాన అర్చకులు విష్ణుమూర్తి చారి, ఆలయ అధ్యక్షులు శ్రీనివాసచారి, మాజీ అధ్యక్షులు రాజు లకు సమాచారం తెలపడంతో ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆలయంలో ఉన్న 2 లక్షల నగదుతో పాటు పంచలోహ విగ్రహం, వెండి వినాయక విగ్రహం, దీపాలను, స్వామివారి వెండి కన్నులను చోరీ చేసినట్లు అర్చకులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాపు చేస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :