Thursday, 25 June 2026 07:58:25 PM

తొమ్మిది నెలలు నిండిన భార్యను హత్య చేసిన భర్త

రాక్షసుడిగా మారిన భర్త...

Date : 06 December 2024 05:57 PM Views : 1078

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / కర్నూల్ జిల్లా : ఆడపిల్ల పుడుతుందేమోననే అనుమానంతో కట్టుకున్న భార్యను, కన్నా కూతురిని అతి కిరాతకంగా హత్య చేసిన అమానుష సంఘటన కర్నూల్ జిల్లాలోని హోళగుంద మండలం, హెబ్బటంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... హేబ్బటం గ్రామానికి చెందిన సకరప్ప,సలీమా భార్యాభర్తలు వీరికి సమీరా అనే మూడేళ్ల కుమార్తె ఉంది. అయితే మళ్లీ గర్భవతి ఐన సలీమాకు తొమ్మిది నెలలు నిండి పదోనెల వచ్చింది. దీంతో మళ్లీ ఆడపిల్లనే కనబోతోందని భావించిన సకరప్ప రాక్షసుడిగా మారిపోయాడు. నిండు గర్భిణీ ఐన భార్యను కిరాతకంగా కొట్టి చంపేశాడు. అంతే కాకుండా భార్యను చంపే ముందు ఈ ఘటనను కళ్లారా చూసిన తన మూడేళ్ల కూతురును కూడా కర్కశంగా గొంతు నిలిమి చంపేశాడు. ఈ కిరాతక చర్య సభ్య సమాజాన్ని కంట తడిపెట్టించింది. అయితే ఆడపిల్లనే పుడుతోందనే విషయమై నిత్యం భార్యా భర్తలు ఘర్షణ పడేవారు. వీరి మధ్య రాత్రి కూడా ఘర్షణ జరగగా, ఆవేశంతో సకరప్ప కర్రతో సలీమా తలపై కొట్టడంతో ఆమె చనిపోయింది.ఈ అకృత్యానికి కుమార్తె సమీరా ప్రత్యక్ష సాక్షి. సాక్ష్యం ఉండకూడదని భావించి.. కుమార్తె అనే కనికర లేకుండా గొంతు నులిమి చంపేశాడు.అనంతరం తనే స్వయంగా పోలీసులకు లొంగి పోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :