Tuesday, 11 August 2026 01:46:53 PM

బసంత్ నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం...

ఒక్కరు మృతి... మరొక్కరి పరిస్థితి విషమం...

Date : 13 December 2024 09:55 AM Views : 2800

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కరీంనగర్ నుండి గోదావరిఖని వైపు వస్తున్న AP16DB5112 అనే స్విఫ్ట్ డిజైర్ కారు అతివేగంగా కల్వర్టును ఢీకొట్టడంతో ముగ్గురికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మీరాజ్యం మృతి చెందగా తల్లి అనసూయ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కు తరలించారు. సతీష్ కు కాలు ఫ్రాక్చర్ కావడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన గోదావరిఖని అడ్డగుంటపల్లికి చెందిన వారిగా తెలుస్తుంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :