Thursday, 25 June 2026 07:57:04 PM

క్షణికావేశంలో భార్యను హత్య చేసిన భర్త..

మంథని మండలంలోని గోపాలపూర్ లో విషాదం..

Date : 31 December 2024 05:42 PM Views : 568

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / మంథని : క్షణికావేశంలో కట్టుకున్న భార్యను గొంతు నులిపి హత్య చేసిన విషాద సంఘటన మంథని మండలం గోపాలపూర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గుంజపడుగు గ్రామానికి చెందిన బొల్లి ఓదెలుకు ముత్తారం మండలంలోని జిల్లెల్ల పల్లె గ్రామానికి చెందిన గడ్డం రాజేశం దంపతుల కూతురు సంధ్యను 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే జీవనోపాధి కొరకు ఓదెలు గోపాలపూర్ శివారులో చికెన్ సెంటర్ ఏర్పాటు చేసుకొని అక్కడే అద్దెకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంట్లో గొడవలు జరగగా ఆవేశంతో ఓదెలు భార్యను గొంతు నులిమి హత్య చేశాడని కుటుంబ సభ్యులు గ్రామస్తులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న మంథని సిఐ రాజు, ఎస్ఐ రమేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :