Thursday, 25 June 2026 08:05:22 PM

రూ.2.25 లక్షల గంజాయి పట్టివేత...

రెండు కేసుల్లో 8.598 కేజీల గంజాయి స్వాధీనం...

Date : 11 December 2024 08:12 PM Views : 395

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / రంగారెడ్డి జిల్లా : దుండిగల్ ప్రాంతంలోని ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులకు గంజాయి అమ్మకాలు జరుపతున్నారనే పక్క సమాచారం మేరకు రంగారెడ్డి ఎస్టీఎఫ్ బీ టీమ్‌, సీఐ సుబాష్‌ టీమ్ కలసి రెండు కేసుల్లో రూ. 2.25 లక్షల విలువ చేసే గంజాయిని పట్టుకున్నారు.పోచంపల్లి ప్రాంతానికి చెందిన దీపక్‌ కుమార్‌, మహమ్మమద్‌ షరిష్‌ ఇస్మాల్‌ అనే వ్యక్తులు గంజాయి అమ్మకాలు జరుపుతుండగా వారి వద్ద నుంచి 7.460 కేజీల గంజాయిని పట్టుకున్నారు. మేడ్చల్‌ చెక్‌పోస్టు వద్ద బీహర్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు గంజాయి అమ్మకాలు జరుపతుండగా 1.138కేజీల గంజాయిని పట్టుకున్నారు.గంజాయి అమ్మకాలు జరుపుతూ పట్టుబడిన వారిలో బీహర్‌కు చెందిన మిలాన్‌కుమార్‌, మనీష్‌ కుమార్‌, అఖిలేష్‌ కుమార్‌లు ఉన్నారు. గంజాయిని పట్టుకున్న టీమ్‌లో stf బి టీమ్‌ సీఐ సుబాష్‌, ఎస్సైలు వెంకటేశ్వర్లు, అఖిల్‌, కానిస్టేబుళ్లు సుధాకర్‌, రవి, మోహన్‌రావు, సుదీప్ రెడ్డి ఉన్నారు. గంజాయిని పట్టుకున్న టీమ్‌ను ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వి.బి. కమలాసన్‌రెడ్డి, అసిస్టేంట్‌ కమిషనర్‌ ఆర్‌. కిషన్‌ ఏఈఎస్‌ జీవన్‌ కిరణ్‌లు అభినందించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :