ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / నాగర్‌కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని వైరోడ్డు సమీపంలో ట్రాక్టర్ - బొలెరో ఎదురెదురుగా రెండు వాహనాలు ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందారు. మృతుడు బాణాలకు చెందిన నాగయ్య యాదవ్ గా గుర్తించారు.సంఘటన వివరాలు తెలుసుకుని అచ్చంపేట, మాజీ ఎంపీపీ రామనాథం కౌన్సిలర్ గౌరీ శంకర్ లు ఆసుపత్రికి వచ్చి పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Admin
Aakanksha News