ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / మంథని : వసూల్ రాజా మాజీ ఉప సర్పంచ్ ఇనుముల సత్యనారాయణ పై మంథని పోలీస్ స్టేషన్లో వరుసగా నాలుగో కేసు నమోదు అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మంథని మండలం నాగారం గ్రామానికి చెందిన బెల్లంకొండ రవీందర్ రెడ్డి అనే వ్యక్తికి మే నెలలో ఐదు కాంట్రాక్ట్ పనులు వచ్చాయి. అయితే ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కాంట్రాక్టర్ వాకింగ్ ట్రాక్ నిర్మాణాన్ని చేస్తుండగా జులై 21వ తేదీన అక్కడికి వెళ్లిన మాజీ ఉపసర్పంచ్ ఇనుముల సత్యనారాయణ నీకు కాంట్రాక్టర్లు బాగా వచ్చాయి. నాకు రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని లేకపోతే నీ కాంట్రాక్టులకు బిల్లులు రాకుండా చేస్తానని గతంలో కూడా కాంటాక్ట్ పనులకు బిల్లులు రాకుండా ఇల్లు నిర్మాణాల గురించి కోర్టులో ఫీల్ దాఖలు చేసి నిలిపి వేశానని కూల్చి వేయించామని పలుమార్లు బెదిరించినట్లు ఫిర్యాదులు పేర్కొన్నారు. దీంతో ఇనుముల సత్యనారాయణకు భయపడి 8వ నెల 28 తేదీన అతని స్నేహితునితో రాగా బీఎస్ ఫంక్షన్ హాల్ మెయిన్ రోడ్ వద్ద లక్ష రూపాయలను ఇచ్చినట్లు తెలిపారు. మిగతా లక్ష రూపాయలు ఇవ్వకపోతే ఆస్తి ప్రాణ నష్టం కలిగిస్తానని బెదిరింపులకు గురి చేయడంతో భయపడి ఫిర్యాదు చేయలేదని ఫిర్యాదరుడు దరఖాస్తులు పేర్కొన్నాడు.
బాధితులు ఉంటే భయపడకుండా నిర్భయంగా బయటికి రండి...మంథని సీఐ
మంథని ప్రజలు,వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, రియాల్టర్స్ తో పాటు ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే మాజీ ఉపసర్పంచ్ ఇనుముల సత్యనారాయణకు భయపడకుండా నిర్భయంగా ధైర్యంగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలని ఇప్పటికే అతనిపై మంతిని పోలీస్ స్టేషన్లో మూడు కేసులు నమోదు అయ్యాయని ఈ కేసులలో సత్యనారాయణకు సహకరించిన రావికంటి సతీష్ ను అరెస్టు చేసి జైలుకు పంపించామని త్వరలో ఇనుముల సత్యనారాయణ కూడా అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరుస్తామని మంతిని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు
Admin
Aakanksha News