Saturday, 14 March 2026 07:11:42 PM

అక్రమ సంబంధం బయటపడడంతో రెస్టారెంట్ నిర్వాహకుడికి దేహశుద్ధి...

తన కారును అక్కడే వదిలి పరారైన రెస్టారెంట్ నిర్వాహకుడు...

Date : 14 March 2026 01:01 PM Views : 1421

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎన్టీపీసీ పరిధిలోని ఓ కాలనీలో ఉద్రిక్త ఘటన చోటు చేసుకుంది. అక్రమ సంబంధం నేపథ్యంలో ఓ రెస్టారెంట్ నిర్వాహకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసిన సంఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే...ఎన్టీపీసీ పరిధిలో రెస్టారెంట్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి ఓ మహిళతో కొంత కాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు సమాచారం.అయితే ఆ వ్యక్తి కాలనీలోకి వచ్చిన సమయంలో సదురు మహిళ భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో అక్రమ సంబంధం విషయం బయట పడింది. దీంతో ఆగ్రహానికి గురైన మహిళ భర్త రెస్టారెంట్ నిర్వాహకుడికి దేహశుద్ధి చేసినట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అయితే అతడు తన కారును అక్కడే వదిలి పరారైనట్లు తెలుస్తుంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, సంబంధిత వ్యక్తి గతంలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో కాంట్రాక్టు పనులు కూడా నిర్వహించినట్లు సమాచారం. ఈ ఘటనతో కాలనీలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మీ ఆకాంక్ష న్యూస్ లో

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :