Friday, 17 April 2026 07:05:26 PM

‘ఇందిరమ్మ అభయం’ పేరుతో ఏపీ కాంగ్రెస్ మొదటి గ్యారంటీ...

Date : 26 February 2024 08:58 PM Views : 316

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అనంతపూర్ జిల్లా : వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ మొదటి గ్యారంటీ ప్రకటించింది. ‘ఇందిరమ్మ అభయం’ పేరుతో మొదటి గ్యారెంటీని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఈ పథకం కింద ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.5 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళా పేరు మీదనే చెక్కు పంపిణీ చేస్తామని అన్నారు. అనంతపురం పట్టణంలో ఏపీసీసీ నిర్వహించిన ‘న్యాయ సాధన సభ’ భారీ బహిరంగ సభలో ఆమె ఈ ప్రకటన చేశారు.‘‘కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి పునాదులు వేసింది. మెట్టు మెట్టు కట్టుకుంటూ నిర్మాణం చేసింది. ఇదే కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రం కోసం ఒక గ్యారెంటీ ఇస్తుంది. ఇంటింటికీ రూ.5 వేలు. పేద కుటుంబాలు నిర్భయంగా బ్రతికే పథకం ఇది. పేదరికం నిర్మూలన కోసం ఇందిరమ్మ అభయం. అసమానతలు తొలగింపు కోసం ఈ నూతన ఆలోచన చేశాం. ప్రతి ఇంటికి అండగా నిలబడేది ఇందిరమ్మ అభయం. ప్రతి ఇంటికి మహిళ పేరుమీదే ఈ రూ.5 వేలు ఇస్తాం. ఇంటికి దైవం ఇల్లాలు. అందుకే మహిళలకు ఈ గ్యారెంటీ. మహిళ పేరు మీదనే చెక్కు ఇస్తాం. కాంగ్రెస్‌ హయాంలో దివంగత వైఎస్సార్ ఎన్నో అద్భుతమైన పథకాలు అమలు చేశారు. మళ్ళీ రాష్ట్ర అభివృద్ది కాంగ్రెస్‌తోనే సాధ్యం. రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్లలో పది అడుగులు కూడా ముందుకు పడలేదు’’ అని వైఎస్ షర్మిల్ అన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :