Friday, 17 April 2026 08:33:28 PM

నాగబాబుకు మంత్రి వర్గంలో చోటు దక్కడం చాలా ఆనందం....

నియోజకవర్గ ఇంచార్జి మర్రెడ్డి శ్రీనివాస్

Date : 10 December 2024 05:58 PM Views : 298

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / పిఠాపురం : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబుకి మంత్రి వర్గంలో చోటు దక్కడం చాలా ఆనందంగా ఉందని పిఠాపురం నియోజకవర్గం జనసేన ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ సంధర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన సీతయ్య గారి తోటలో జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాగబాబుకి క్యాబినెట్ మినిస్టర్ గా హోదా కల్పించడం పార్టీ క్యాడర్లో మరింత బలం చేకూరిందని, పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందన్నారు. ముందుగా నాగబాబుకి క్యాబినెట్ మినిస్టర్ గా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ లకు మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేసారు. ఎన్నికల సమయంలో నాగబాబును అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని పవన్ కళ్యాణ్ భావించారు. సీటు ఇక నాగబాబుకే అన్న సమయంలో పొత్తుల లెక్కలకు తెరలేచింది. పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి వెళ్లింది. టిడిప, బిజెపి, జనసేన పొత్తు కోసం అన్నయ్య నాగబాబు సీటును పవన్ కళ్యాణ్ త్యాగం చేశారు. నాగబాబు కూడా కూటమి గెలుపునకు తన వంతు కృషి చేశారు. ఎన్నికల్లో గెలిచి టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక నాగబాబుకు కేబినెట్ లో చోటు దక్కడం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం జనసేన నాయకులు, వీర మహిళలు, పార్టీ కార్యకర్తలు మరియు జనసైనికులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను మర్రెడ్డి శ్రీనివాస్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా పార్టీ కార్యాలయంలో ఆనందోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మహిళా కోఆర్డినేటర్ చల్లా లక్ష్మి, జనసేన నాయకులు చెల్లుబోయిన సతీష్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, మురాలశెట్టి సునీల్ కుమార్, బొజ్జా లోవరాజు, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్, జోగా వెంకటరమణ, కోలా సాయి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజర్ బాబు, రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు, జనసేన నాయకుడు బి.ఎన్.రాజు, వీరమహిళలు డాక్టర్ వరలక్ష్మి, మేడిశెట్టి నాగమణి, అంబటి దేవి, కుక్కల నాగమణి, కమల తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :