Friday, 17 April 2026 09:30:33 AM

మహాపాదయాత్రకు భారీగా తరలివెళ్ళిన భక్తులు..

మహాఅన్నదానం ఏర్పాటు చేసిన జ్యోతుల శ్రీనివాస్‌

Date : 25 November 2024 05:45 PM Views : 277

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలోని స్థానిక బస్టాండ్‌ వద్ద కొలువైన విజయదుర్గా అమ్మవారి ఆలయం నుండి అన్నవరం సత్యదేవుని ఆలయం వరకు ఆదివారం ఉదయం అశేష భక్త జనం మహా పాదయాత్ర చేపట్టారు. దీంతో గొల్లప్రోలు పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. ఈ సంధర్భంగా పెద్దలు, పిల్లలు, మహిళలు ఈ మహాపాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి మరియు సాయి ప్రియా సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మూడు వేల మంది భక్తులు పాదయాత్రలో పాల్గొంటారని తెలియజేశారు. పాదయాత్రలో పాల్గొన్న భక్తులందరికీ భోజన సదుపాయం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి గుడికి దగ్గరలో సాయి ప్రియ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని శ్రీనివాస్‌ తెలిపారు. తమ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సత్యనారాయణమూర్తి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసామన్నారు. ప్రతి సంవత్సరం ఇదేవిధంగా భక్తులు కొనసాగాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ టిడిపి నాయకుడు వెన్న శివ, తాటిపర్తి మాజీ ఎంపిటిసి సభ్యుడు, అపర్ణదేవి ఆలయ ఛైర్మన్‌ కుంపట్ల సత్యనారాయణ, జనసేన నాయకులు కడారి తమయ్యనాయుడు, మామిడాల సూరిబాబు, బస్సా చిట్టిబాబు, రావుల తాతారావు, బలిరెడ్డి గంగబాబు, కూరాకుల చందర్రావు, మొగిలి రాజా, బుడంకాయల దొరబాబు, అల్లం దొరబాబు, టెలిఫోన్‌ బోర్డు అడ్వైజర్‌ కమిటీ మెంబర్‌ మేకల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :