Saturday, 08 August 2026 10:31:19 AM

బాలినేని అక్రమాలపై విచారణ జరిపించాలి..జనసేన

Date : 12 December 2023 03:40 PM Views : 315

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : రాష్ట్రంలో సహజసిద్ధమైన సంపదను వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు దోచుకుంటున్నారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ పేర్కొన్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు మంత్రిగా ఉన్న సమయంలో లంచాలు తీసుకున్నారని బహిరంగంగా చెప్పారన్నారు. బాలినేని కుటుంబ సభ్యులకు అక్రమంగా మైనింగ్‌ను కట్టబెట్టారన్నారు. అక్రమంగా మైనింగ్ కేటాయింపులో ఐఏఎస్ అధికారులు లంచాలు తీసుకున్నారని.. విచారణ జరిపించాలన్నారు. మాజీ మంత్రి బాలినేని అక్రమాలపై ఈడీ, సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. బాలినేనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. లేదంటే జనసేన పార్టీ పోరాటం చేస్తుందని కార్పోరేటర్ మూర్తి యాదవ్ తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :