Friday, 17 April 2026 01:29:01 PM

ఏపీలో జంట హత్యల కలకలం..

ఘర్షణలో అన్నదమ్ములు మృతి...

Date : 04 January 2024 09:18 PM Views : 243

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / కడప జిల్లా : కొత్త ఏడాది రోజున చిన్నపాటి ఘర్షణ ఇద్దరు అన్నదమ్ముల మృతికి కారణమైంది. ఏపీలోని వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేలులో జరిగిన జంట హత్యలుకలకలం రేపుతున్నాయి. డిసెంబర్‌ 31న బద్వేలు పట్టణంలో ఇద్దరు అన్నదమ్ములు పసుపులేటి ప్రశాంత్‌, పసుపులేటి సాయికుమార్‌ విజయ్‌భాస్కర్‌ అనే వ్యక్తితో గొడవపడ్డారు.మూడు రోజుల తరువాత గురువారం విజయ్‌భాస్కర్‌ కుమారులు తరుణ్‌తేజ్‌, ప్రమోద్‌ కుమార్‌, వారి స్నేహితులు కలిసి ప్రశాంత్‌, సాయికుమార్‌ ఇంటికి వచ్చి మారణాయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో అన్నదమ్ములు ఇద్దరూ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు(Police) ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. దాడులకు పాల్పడ్డ వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మరికొందరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :