Wednesday, 23 September 2026 11:30:40 PM

పీడీఎస్ రైస్ విదేశాలకు తరలించడం వెనుక పెద్ద మాఫియా...

ఐహెచ్ఆర్ఏ స్టేట్ సివిల్ రైట్స్ చేర్మెన్ కారణం తిరుపతి నాయుడు డిమాండ్

Date : 02 December 2024 05:59 PM Views : 494

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / గుంటూరు జిల్లా : రాష్ట్రంలో పీడీఎస్ రైస్ విదేశాలకు తరలించడం వెనుక పెద్ద మాఫియా..ఉందని ఐహెచ్ఆర్ఏ స్టేట్ సివిల్ రైట్స్ చేర్మెన్ కారణం తిరుపతి నాయుడు ఆరోపించారు. ఇదో జాతీయ స్థాయి కుంభకోణం అని పేర్కొన్నారు.. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.పేదల పొట్టకొట్టి 48 వేల కోట్ల రూపాయల ప్రజల డబ్బును పందికొక్కుల్లా తినేసిన దోపిడీ చేశారని మండిపడ్డారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు.. రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉందని ఆరోపించారు. కింద నుంచి ఉన్నత స్థాయి వరకు కొంతమంది అవినీతి అధికారుల పాత్ర ఉందన్నారు.ఎవరికి దక్కాల్సిన వాట వాళ్లకు చేరుతుండటంతో నిఘా వ్యవస్థ పూర్తిగా కళ్ళుమూసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలోని పోర్టుల నుంచి 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అయ్యిందంటే మన చెక్ పోస్టుల పని తీరు ఏంటో అంచనా వేయొచ్చన్నారు. ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ‘‘అక్రమ బియ్యాన్ని పట్టేందుకు మీరు బోట్లు వేసుకొని సముద్రంలో హడావిడి చేయడం కాదు. నిజాలు నిగ్గు తేల్చండి’’ అంటూ కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.‘‘పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా పోర్టు దాకా ఎలా చేరుతుంది ? మూడేళ్లలో 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యాన్ని ఎలా సేకరించారు ? దీని వెనకున్న బియ్యం దొంగలెవరు? రూ.48 వేల కోట్లు ఎవరెవరు తిన్నారు? అప్పటి ప్రభుత్వ పెద్దలకు బియ్యం మాఫియాతో సంబంధాలు ఉన్నాయా? కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలి’’ తిరుపతి నాయుడు డిమాండ్ చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :