Friday, 17 April 2026 10:22:11 AM

వేలాది మందితో 72 ఎకరాలలో సిపిఐ భూ ఆక్రమణ పోరాటం...

పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేవరకు పోరాటం ఆగదు... సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

Date : 21 March 2025 06:43 PM Views : 778

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం కొమరగిరి లేఔట్ 72 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని కొంత మంది కబ్జా చేస్తున్నారని ఇది ఇళ్ల స్థలాల కొరకు కొన్న భూమి కాబట్టి ఇళ్ల స్థలాలకే కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు.శుక్రవారం సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వేలాది మంది గ్రామీణ పేదలకు కబ్జాకు గురవుతున్న 72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని భూ పోరాటం నిర్వహించారు. అనంతరం జరిగిన సభకు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు తాటిపాక మధు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కె.రామకృష్ణ మాట్లాడుతూ ఆనాటి వై.యస్.జగన్ ప్రభుత్వం ఇళ్ల స్థలాల కొరకు కొమరగిరి పేజ్ టు 72 ఎకరాలు రైతులు వద్ద నుండి 32 కోట్లు వెచ్చించి భూమి కొందని, ఎన్నికల అనంతరం ఈ భూమిపై భూ కబ్జాదారుల కన్ను పడిందని ఆయన అన్నారు. అందులో భాగంగా 42 ఎకరాల భూమిని అక్రమంగా సాగు చేస్తూ అనుభవిస్తున్నారని, దీనిపై రెవెన్యూ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆయన విమర్శించారు. అయితే కొంత మంది విఆర్వోలు భూకబ్జాదారులకు సాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. గత నాలుగు నెలలుగా సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతాలలో పేదలకు మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వాలని దశల వారి పోరాటాలు నిర్వహించిందని, కొన్ని భూములలో భూపారాటం నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు. ఈ పేదల భూమిపై ఇప్పటికే ముఖ్యమంత్రిని, రెవెన్యూ శాఖ మంత్రిని కలుస్తామని, ఈ కొమరగిరి భూ విషయంపై త్వరలో రెవెన్యూ శాఖ మంత్రి కలుస్తామని, జనసేన అధినేత, పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కి లేఖ రాస్తానని ఆయన తెలిపారు. అప్పటికి ప్రభుత్వం ఈ పేద ప్రజలకు ఈ భూమిలో స్థలాలు ఇవ్వకపోతే మరొకసారి ఇక్కడే మేమే వచ్చి స్థలాలు పంపకాలు చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పి.సత్యనారాయణ, కేశవరపు అప్పలరాజు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా కన్వీనర్ ఏ.భవాని, సమాచార హక్కుల వేదిక నాయకుడు బళ్ళ సురేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నక్క శ్రీనివాసరావు, రైతు సంఘం జిల్లా కన్వీనర్ మేడిశెట్టి వీరబాబు, తూర్పుగోదావరి జిల్లా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలపూడి సునీల్, ఏఐవైఎఫ్ తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి పి.త్రిమూర్తులు, ఏఐవైఎఫ్ బాబి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కేతా గోవిందు, వాసంశెట్టి గురవయ్య, మేడిశెట్టి శీను, కొమరగిరి వార్డ్ మెంబర్స్ కొప్పిశెట్టి త్రిమూర్తులు, శాఖ ఝాన్సీ, రాజకీయ పార్టీలకతీతంగా సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :