Thursday, 24 September 2026 12:17:13 AM

ఉల్లిపాయ బాంబు బస్తా పేలి ఒకరి మృతి...6గురికి తీవ్ర గాయాలు

దీపావళి పండుగ రోజు ఆంధ్రప్రదేశ్ ఏలూరులో అపశృతి..

Date : 31 October 2024 04:39 PM Views : 426

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / ఏలూరు జిల్లా : దీపావళి పండుగ రోజు ఆంధ్రప్రదేశ్ ఏలూరులో అపశృతి చోటుచేసుకుంది. ఏలూరు తూర్పు వీధి గంగానమ్మ గుడి వద్ద ఉల్లిపాయ బాంబు బస్తా పేలి సుధాకర్ అనే వ్యక్తి మృతిచెందగా, 6 గురికి తీవ్ర గాయాలైయ్యాయి. గాయపడిన వారిలో తాబేలు సాయి, సువార శశి, కే. శ్రీనివాసరావు, ఎస్కే ఖాదర్, సురేష్, సతీష్‌లు ఉన్నారు.హోండా యాక్టివా వాహనంపై ఉల్లిపాయ బాంబు బస్తా తీసుకువెళుతుండగా గోతిలో బండి పడటంతో ఒక్కసారిగా ఉల్లిపాయ బాంబులు పైకి లేచి తిరిగి బస్తాలో పడటంతో పేలుడు సంభవించింది. దీంతో వాహనం వెనుక కూర్చొని ఉన్న వ్యక్తి శరీరభాగాలు పేలుడు ధాటికి తెగిపడిపోయాయి. సమాచారం అందుకున్న ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, వన్ టౌన్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐ మదీనా బాషా సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పేలుడు సంఘటనతో ఒక్కసారిగా తూర్పు వీధి ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :