ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / విజయవాడ : విజయవాడ డివిజన్‌లో చేపడుతున్న రమ్మతుల కారణంగా పలు రైళ్లను రద్దుచేసినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.- నెం.17237 బిట్రగుంట - చెన్నై సెంట్రల్, నెం.17238 చెన్నై సెంట్రల్ - బిట్రగుంట రైళ్లు ఈ నెల 30 నుంచి నవంబరు 3వ తేది వరకు రద్దు. - నెం.07659 తిరుపతి - కాట్పాడి, నెం.07682 కాట్పాడి - తిరుపతి(Katpadi - Tirupati) స్పెషల్ రైళ్లు ఈ నెల 30 నుంచి నవంబరు 5వ తేది వరకు రద్దు. - నెం.06417 కాట్పాడి - జోలార్‌పేట, నెం.06418 జోలార్‌పేట - కాట్పాడి మెమో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఈ నెల 30 నుంచి నవంబరు 5వ తేది వరకు రద్దు. - నెం.06401 అరక్కోణం - కడప, నెం.06402 కడప - అరక్కోణం మెమో స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఈనెల 30 నుంచి నవంబరు 5వ తేది వరకు రద్దు. పాక్షిక రద్దు... - నెం.16854 విల్లుపురం - తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు ఈనెల 30 నుంచి నవంబరు 5వ తేది వరకు కాట్పాడి వరకు మాత్రమే నడువనుంది. అలాగే, నెం.16853 తిరుపతి - విల్లుపురం ఎక్స్‌ప్రెస్ రైలు ఈనెల 30 నుంచి నవంబరు 5వ తేది వరకు తిరుపతికి బదులుగా కాట్పాడి నుంచి బయల్దేరుతుంది
Admin
Aakanksha News