Friday, 07 August 2026 06:07:54 AM

రాజకీయాల్లోకి స్టార్ కమెడియన్...

Date : 12 June 2023 02:33 PM Views : 438

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / తిరుపతి జిల్లా : తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి టీడీపీలో చేరబోతున్నట్లు స్టార్ కమెడియన్, సినీ నటుడు సప్తగిరి ప్రకటించారు. ఈ సందర్భంగా తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తన పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రకటన చేశారు.పేదలకు సేవ చేయడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా నా వంతు కృషి చేస్తా’ అని చెప్పారు. టీడీపీ నుంచి ఆఫర్ ఉన్నమాట వాస్తవమేనని, కాకపోతే ముందే చెప్పడం సరికాదని అన్నారు. మరో 10, 15 రోజుల్లో శుభవార్త చెబుతానని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏమి ఆదేశిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. టీడీపీ అధికారంలో రావడానికి తన సేవలు అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తానని, చిత్తశుద్ధితో పని చేస్తానని తెలిపారు.చిత్తూరు జిల్లాలోని లోక్ సభ లేదా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :