Friday, 17 April 2026 01:30:46 PM

ఆరోగ్య సురక్ష కార్యక్రమం అద్భుతం: కర్రి వేణుమాధవ్

Date : 20 October 2023 05:21 PM Views : 237

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా రూపొందించి క్షేత్రస్థాయిలో అమలుపరుస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష పథకం అద్భుతమైందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇంచార్జ్ కర్రి వేణుమాధవ్ తెలియజేశారు. ఈ పథకం యొక్క పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి ఆయన శుక్రవారం అమలాపురం జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో బాలాంత్రకం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ సమాచార సినిమాటోగ్రఫీ బీసీ సంక్షేమ శాఖ మాత్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారితో కలిసి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో వైద్య బృందం గ్రామంలో ప్రతి కుటుంబయొక్క వివరాలతో పాటుగా ఆరోగ్య విషయాలను గ్రామస్థాయిలో అందరికీ చైతన్యం చేయడం ప్రతివారు ఆరోగ్య జాగ్రత్తలు పాటించే విధంగా సూచనలు చేసే విధానం అద్భుతంగా ఉన్నదని వేణుమాధవ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారినీ ప్రశంసించారు అలాగే నవంబర్ 15 నుండి రాష్ట్రంలో సమగ్ర కులాల గణన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ప్రారంభిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి మొదటి నుంచి రాష్ట్రంలో ముందడుగు వేయడానికి కృషిచేసిన మంత్రివర్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఘనంగా సన్మానించారు కర్రి వేణుమాధవ్ ఈ కార్యక్రమంలో పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :