Friday, 17 April 2026 01:32:10 PM

తనపై వ్యక్తిగత విమర్శలు కాదు.. 9 ప్రశ్నలకు సమాధానం చెప్పండి

వైసీపీ నేతలకు.. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్

Date : 13 February 2024 05:10 PM Views : 312

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / విజయవాడ : తనపై వ్యక్తిగత విమర్శలు కాకుండా.. తాను అడిగే 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వైసీపీ నేతలకు.. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి 52 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే.. ఆయన వారసుడిగా చెప్పుకొనే జగన్ ఆన్న కేవలం 6 వేల పోస్టులతో దగా డీఎస్పీ చేశారని విమర్శించారు. దీనిపై ప్రశ్నిస్తే తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, అలాంటి వైసీపీ నాయకులు, వాళ్లను వెనకేసుకొచ్చే వైసీపీ సోషల్ మీడియాకు ఆమె 9 ప్రశ్నలు సంధించారు.

1.2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 25 వేల టీచర్ పోస్టుల భర్తీ ఎక్కడ ? 2. ఐదేళ్లు నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన ఎందుకు చేశారు ? 3. ఎన్నికలకు నెలన్నర ముందు 6 వేల పోస్టుల భర్తీ చేయడంలో ఆంతర్యం ఏమిటి ? 4. టెట్, డీఎస్సీ కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలి ? 5. నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా ? టెట్‌కి 20 రోజులు, తర్వాత డీఎస్సీ మధ్య కేవలం 6 రోజుల వ్యవధా..? 6. వైఎస్సార్ హయాంలో 100 రోజుల గడువు ఇచ్చిన సంగతి వారసుడు జగన్‌కి గుర్తులేదా ? 7. ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి 150 పుస్తకాలు చదవాలని మీకు తెలియదా ? 8. రోజుకి 5 పుస్తకాలు చదవడం అభ్యర్థులకు సాధ్యపడే పనేనా ? 9. మానసిక ఒత్తిడికి గురిచేసి నిరుద్యోగులను పొట్టన పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా ? ఇది కక్ష్య సాధింపు చర్య కాదా? నవ రత్నాలు, జాతి రత్నాలు అని చెప్పుకొనే జగన్ ఆన్న, ఆయన చుట్టూ ఉండే సకల శాఖ మంత్రులకు దమ్ముంటే ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ షర్మిల సవాల్ విసిరారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :