Friday, 17 April 2026 09:30:17 AM

సినీనటి మాధవీలతకు క్షమాపణలు తెలిపిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి...

Date : 05 January 2025 06:19 PM Views : 406

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అనంతపూర్ జిల్లా : తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి 2024 డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ వేడుకలలో పుష్ప 2 సినిమాలోని సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి అంటూ సాగే పాటకు డ్యాన్స్ చేసారు. కాగా ఈ ఈవెంట్‌కు ముందు సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి వీధితమే. దీనిపై జేసీ ఘాటుగా స్పందించారు. మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. అలాంటి వాల్లు తన గురించి మాట్లాడుతారా? అని ధ్వజమెత్తారు.ఈ వ్యాఖ్యల తరువాత అనంతపురంలో దివాకర్ ట్రావెల్స్ బస్సులు దగ్ధమయ్యాయి.దీనిపై బీజేపీ నేతలపై దారుణ పదజాలంతో జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఈ వివాదం రోజురోజుకు ముదిరిపోతూ ఉండటంతో ఎట్టకేలకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించి మాధవీలతకు క్షమాపణలు తెలిపారు. అనంతరం తనపై విమర్శలు చేసిన వాళ్లంతా ఫ్లెక్సీ గాళ్లే అని ఘాటుగా విమర్శించారు.అలాగే తాను ఆవేశంతో సినిమా నటి మాధవిలతపై ఆ పదం వాడడం తప్పేనన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :