Friday, 17 April 2026 10:21:15 AM

ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబునాయుడు మరో లేఖ

Date : 08 December 2023 07:32 PM Views : 226

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : ఎన్నికల కమిషన్‌కు టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరో లేఖ రాశారు. రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా నమోదైన దొంగ ఓట్ల వివరాలతో లేఖ రాసినట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖను కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు పంపించారు. రాష్ట్రంలో ఓట్ల అవకతవకలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈసీని చంద్రబాబు కోరారు. ఎలక్టోరల్ మాన్యువల్ 2023 ప్రకారం ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు జరగడం లేదని తెలిపారు. మాన్యువల్ ప్రకారం జనాభా పరమైన సారూప్య ఎంపికలు, ఫోటో గ్రాపిక్ సారూప్య ఎంపికలు పరిశీలించి డబుల్ ఎంట్రీలను తొలగించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితాలో అనేక నియోజకవర్గాలలో ఇప్పటికీ డబుల్ ఎంట్రీలు ఉన్నాయని తెలుగుదేశం అధినేత స్పష్టం చేశారు. "ఇంటింటి సర్వేలో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు గుర్తించిన మరణాల సమాచారం, రాష్ట్ర డేటా బేస్‌లోని బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రార్ సమాచారం మేరకు ఈఆర్ఓలు మరణించిన వారి ఓట్లు తొలగించాలి. కానీ, దురదృష్టవ శాత్తు డ్రాప్ట్ ఓటర్ లిస్టులో ఇప్పటికీ మరణించిన వారి ఓట్లు దర్శనమిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ – 1960 ప్రకారం ఓట్లను ఇంటి నంబర్ల ప్రకారం క్రమంగా ఉండేలా చూడాల్సి ఉన్నా... నేటికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అర్హత లేని వారికి ఫామ్ – 6 ద్వారా ఆన్‌లైన్ లో ఇష్టానుసారంగా ఓట్లు నమోదు చేస్తున్నారు.అధికార పార్టీకి అనుకూలంగా ఇష్టానుసారం ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారు. వీటిపై తెదేపా లేవనెత్తిన అభ్యంతరాలపై నేటికీ దృష్టి పెట్టలేదు. నేరుగా గానీ, ఆన్‌లైన్‌లో గానీ ఫామ్-7 ధరఖాస్తులను స్వీకరించరాదు. ఓటుపై అభ్యంతరం లేవనెత్తి ఓట్లను తొలగించాలని కోరుతున్న వారు ఖచ్చితంగా ఆధారాలు చూపించాలి. "కొన్ని నియోజకవర్గాలలో ఎటువంటి విచారణ చేయకుండా తెల్ల పేపర్‌పై పేర్లు రాసిస్తే ఓట్లను తొలగిస్తున్నారు. నేటికి ఈఆర్ఓలు ఓటర్లకు నోటీసులు జారీ చేస్తూ ఓటర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఓట్ల మార్పులు చేర్పులకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక రివిజన్ సమ్మరీ సందర్భంగా చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డ్రాప్ట్ ఓటర్ లిస్టు ప్రకటించి నెల గడుస్తున్నా లేవనెత్తిన అభ్యంతరాలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఫైనల్ లిస్టులో ఓట్ల అవకతవకలు మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. దీనికి సంబంధించి ఈఆర్ఓలకు, డీఈఓలకు నిర్ణీత సమయం కల్లా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయాలి" అని ఈసీని చంద్రబాబు కోరారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :