Tuesday, 22 September 2026 10:14:20 PM

అధికారిక లాంఛనాలతో నారా రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు

Date : 17 November 2024 06:29 PM Views : 443

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / తిరుపతి జిల్లా : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు నారావారి పల్లెలో అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. ఏపి మంత్రి లోకేశ్, రామ్మూర్తి నాయుడు తనయుడు, సినీ నటుడు రోహిత్, ఇతర కుటుంబ సభ్యులు ఈ అంత్యక్రియలో పాల్గొన్నారు. తన తల్లిందండ్రుల అంతిమ సంస్కారాలు నిర్వహించిన చోటే రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు నిర్వహించారు. హైదరాబాద్ లో చికిత్స పొందుతూ నారా రామ్మూర్తి నాయుడు కన్ను మూసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు చాలా మంది ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :