ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / పిఠాపురం : స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారా వెంకట్రావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైల్వే స్టేషన్ మాస్టర్ పి.నాగబాబు, మల్లాం సర్పంచ్ దాట్ల సూరిబాబు, విరవాడ సర్పంచ్ బోయి నాగేశ్వరరావు, చిన్న జగ్గంపేట మాజీ సర్పంచ్ గుల్ల కృష్ణ, బీసీ నాయకులు నాగేశ్వరరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గుబ్బల రాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, స్త్రీ విమోచకుడైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఆయనను గుర్తు చేసుకోవాలని, ప్రజలకు అనేక హక్కులను అందించడం జరిగిందని, ఆయన ఆలోచన విధానముతో మనం ముందుకు సాగాలన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా తమ సమయాన్ని జాతి కోసం వినియోగించాలని, నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఎస్సీల వర్గీకరణ చేయడం ద్వారా ఎస్సీలను విభజన చేయడం అన్నది ప్రధానమైతే రిజర్వేషన్ పెట్టేయడం ప్రధానమైన అంశంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అంశమని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పించిన హక్కులను కాపాడాలని ప్రతి ఒక్కరు కూడా ఉద్యమాల్లోని చురుగ్గా పాల్గొవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాల్దారి లచ్చబాబు, ముంజువరపు కృపానందం, పులుగు బాబురావు, యాగంటి వినోద్, బర్రె రాజు, ములకపాటి బుచ్చిరాజు, మూరా కన్నారావు, దడాల అప్పన్న నక్క వినోద్, కాకర యేసు, ధోనం అజయ్, దుర్గాడ సత్తిబాబు, గుళ్ళ రాజేష్, దుర్గాడ సింహాచలం, దడాల సత్తిబాబు, చంటిబాబు, గుబ్బల సన్నీ తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News