Tuesday, 21 April 2026 01:36:31 PM

అనర్హత పిటిషన్లపై స్పీకర్ వద్ద విచారణకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు డుమ్మ...

Date : 12 February 2024 06:15 PM Views : 289

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : అనర్హత పిటిషన్లపై స్పీకర్ వద్ద విచారణకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. సోమవారం స్పీకర్ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ ఎమ్మెల్యేలుగా నోటీసులు అందించినప్పటికీ విచారణకు వెళ్లలేదు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. తాము వివిధ కారణాల దృష్ట్యా విచారణకు హాజరు కాలేకపోతున్నామని స్పీకర్‌కు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. తాము అనారోగ్య కారణాల దృష్ట్యా హాజరు కాలేకపోతున్నట్టు ఒకరిద్దరు లేఖలు రాశారు. కాగా వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలను ఉదయం పూట, టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు మధ్యాహ్నం పూట విచారణకు రావాలని స్పీకర్ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :