Saturday, 08 August 2026 06:52:04 AM

ఏసీబీకి పట్టుబడిన విఆర్వో, తహసిల్దార్...

30 వేలు లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు...

Date : 31 January 2025 03:10 PM Views : 596

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / NTR జిల్లా : అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇద్దరు రెవిన్యూ అధికారులపై కొరడా జుల్పించారు... రెడ్ హ్యాండెడ్ గా లంచం తీసుకుంటూ ఉండగా ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండల తహశీల్దార్, వీఆర్వో ను పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... కంచికచర్ల మండలం పరిటాలకు చెందిన రైతు భూమి పట్టా సరిచేయడం కోసం మాగంటి కోటేశ్వరరావును తహశీల్దార్ రూ.లక్ష డిమాండ్ చేసింది. రూ.30వేలకు పాసు బుక్ జారీ చేసేటట్లు బేరం కుదుర్చుకున్నారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రైతు తహశీల్దార్ కార్యాలయంలో డబ్బులు ఇస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు నేరుగా పట్టుకున్నారు. ఇందులో భాగమైన వీఆర్వో రామారావును కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రూ.30వేలు లంచం తీసుకుంటూ తహశీల్దార్ జాహ్నవి రెడ్డి, వీఆర్వో రామారావులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కంచికచర్ల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు ఏసిబి డిఎస్పీ కిశోర్ బాబు మీడియాకు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :