Friday, 07 August 2026 04:30:25 AM

ఆర్యవైశ్యులకు పెద్దపీట వేస్తున్న కుటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటాం

పిఠాపురం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఇమిడిశెట్టి నాగేంద్ర కుమార్

Date : 21 December 2024 05:52 AM Views : 363

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / పిఠాపురం : కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు (కొండబాబు)ను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వెలగ వెంకట నగేష్, పిఠాపురం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఇమిడి శెట్టి నాగేంద్ర కుమార్, వాసవి కన్యకా పరమేశ్వరి భక్త సమాజం కార్యదర్శి కంచర్ల నగేష్, కర్ణాటకపు తాతాజీ, మాజేటి సూర్య గణేష్ తదితరులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులను గుర్తించి రాష్ట్ర కార్పొరేషన్ లో కాకినాడ జిల్లా నుంచి కొండబాబును ఆర్యవైశ్య డైరెక్టర్ గా నియమించడం చాలా ఆనందంగా ఉందని, ఈరోజు తమ మండలం నుంచి విచ్చేసి వారిని ఘనంగా సత్కరించుకున్నమని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఘనంగా నిర్వహించడమే కాకుండా, జనవరి 31 తేదీన వాసవి మాత ఆత్మార్పణ వేడుకలు కూడా అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం ఆర్యవైశ్యులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి కనపడుతుందని అన్నారు. కొత్త కొండబాబు మాట్లాడుతూ ఆర్యవైశ్యులను గుర్తించిన ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. అదేవిధంగా ఆర్యవైశ్యులలో చాలా పేదవారు కూడా ఉన్నారని వారికి కూడా జీవనోపాధి కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి కార్పొరేషన్ ద్వారా రుణాలు, గృహాలు, షాపులు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక సహాయం అందించేందుకు చేయూతనివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం ఆర్యవైశ్య సంఘం చైర్మన్ బోడ సతీష్, చేబ్రోలు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ములుకురి వెంకటరాజు గుప్తా, వాసవి క్లబ్ అధ్యక్షుడు కొత్త జగన్మోహన్, చక్క వీరబాబు, ఆత్కూరి రాము, ఇమ్మిడిశెట్టి ప్రసాద్, కంచర్ల బద్రి, జగ్గంపేట ఆర్యవైశ్య ప్రముఖులు బి.నూకబాబు, బి.వీరసత్య, కంచర్ల బాబు, దారా శ్రీనివాస్, మానేపల్లి వీర్రాజు గుప్తా, మాతం శెట్టి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :