ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / పిఠాపురం : అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి, పిఠాపురం నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ ఇన్చార్జి ఖండవల్లి లోవరాజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సంధర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం, సమాన హక్కుల కోసం ఏకంగా మంత్రి పదవినే వదులుకున్న స్త్రీవాది, సమాజ ప్రగతి స్త్రీలు సాధించిన ప్రగతిపై ఆధారపడి ఉంటుందన్న అభ్యుదయవాది అని ఆయన అన్నారు. మాటలతో ఆగిపోకుండా ఆచరణాత్మకంగా పనిచేసిన స్త్రీ పక్షపాతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ప్రపంచ దేశాలు అన్ని పోరాటాలతో, ఉద్యమాలతో హక్కులు సాధించుకుంటే భారత దేశంలో మాత్రం అంబేద్కర్ ఒక్కరే మహిళల తరపున అవిశ్రాంత పోరాటం చేశారన్నారు. "స్త్రీ స్వతంత్ర మర్హతి" అంటూ స్వేచ్ఛను మహిళలకు సమాజం నిరాకరిస్తే దేశంలో అంబేద్కర్ ఒక్కరే మహిళా స్వేచ్ఛ కోసం పోరాటం చేశారు. మహిళల అభివృద్ధి దేశానికి నిజమైన అభివృద్ధి అంటూ అంబేడ్కర్ పోరాటం చేశారు. పోరాటాన్ని కులం కారణంగా ఆధిపత్య వర్గాలు సమాజానికి తెలియనీయకుండా జాగ్రత్త పడ్డారు.
నవ సమాజ నిర్మాత అంబేద్కర్....
కుల, మత, లింగ,ప్రాంతం, పుట్టిన ప్రతిపాదనల మీద ఏ వ్యక్తి వివక్షతకు గురి కాకూడదు అన్నాడని, భారత నవ సమాజ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ బలంగా విశ్వసించిన సిద్ధాంతం, అందుకు అనుగుణంగానే భారత రాజ్యాంగం నిర్మాణం చేశాడన్నారు. ఆచారాలు, మతవిశ్వాసాల కారణంగా భారతీయ సమాజంలో దయనీయంగా మారిన మహిళలకు విముక్తి కల్పించారుఅంబేద్కర్. బాధ్యతలే తప్ప ఎలాంటి హక్కులు లేని ఆధిపత్య కుల వ్యవస్థలో అంటరానితనాలకు, వెట్టి చాకిరిలకు, వెలివేతలకు గురవుతున్న మహిళలు లైంగిక వేధింపులు, హింసలు, దాడులకు గురవుతున్న మహిళలకు, పసితనాన్నే పసిద్దాయే మహిళలకు ఇతర ప్రమాధకారమైన వృత్తుల్లో, సేవల్లో, కనీస సమాన వేతనాలు లేని శ్రామిక రంగాల్లోని మహిళలకు, ఆస్తులు లేని మహిళలకు, పాకీ వృత్తి మహిళలకు, భర్తలను కోల్పోయి మరో పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని గడిపేస్తున్న మహిళలకు, సామాజిక న్యాయాలు, మానవ హక్కులు కోల్పోయిన మహిళలకు, విముక్త కలిగించాలని కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు. రాజ్యాంగ ప్రయోజనాలు స్త్రీలకు పూర్తిగా అందడం లేదని చట్టాలు రూపొందించి తీసుకురావాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు ప్రతిపాదించడం జరిగిందన్నారు. భారతదేశ శ్రేయస్సు కోసం స్త్రీలు తల్లులుగా ప్రసవించే సమయంలో కూడా వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని అంబేద్కర్ ప్రతిపాదన మంచి ఫలితాలను ఇచ్చాయాన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News