Monday, 21 September 2026 08:09:45 PM

కేసీఆర్ బీఆర్ఎస్ తో ఒరిగేదేమీ లేదు...

30ఏళ్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ సీఎంగా ఉంటారు..

Date : 05 October 2022 04:28 PM Views : 405

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన కొత్త పార్టీ బీఆర్ఎస్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని విశాఖపట్నం వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ విమర్శించారు. కొత్త పార్టీ ప్రకటించినంతమాత్రాన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కేసీఆర్ ను విశ్వసించారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో నష్టపోయారని దీంతో హైదరాబాద్ తెలంగాణలో ఉండి పోవడం వల్ల ఎంతో నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎంతో ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో వెనుకబడి పోయిందని, అభివృద్ధి అంతా హైదరాబాదులోనే ఉండి పోవడం వల్ల చాలా జిల్లాలు వెనుకబాటు తనానికి గురయ్యాయని పేర్కొన్నారు. ఇప్పుడు ఎన్ని పేర్లు మార్చుకొని వచ్చినా ఆంధ్ర ప్రజలు కేసీఆర్ ను విశ్వసించారని ఆయన జోస్యం చెప్పారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :