Monday, 21 September 2026 08:12:27 PM

కార్పొరేటర్‌ కు ఎక్కువ..ఎమ్మెల్యే కు తక్కువ..

పవన్‌ కల్యాణ్‌ పై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Date : 06 March 2025 06:34 AM Views : 784

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / గుంటూరు జిల్లా : జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.పవన్‌ జీవితంలో ఒకేసారి ఎమ్మెల్యే అయ్యాడని, ఆయన తీరును చూస్తుంటే కార్పొరేటర్‌ కు ఎక్కువ.. ఎమ్మెల్యే కు తక్కువ అంటూ వ్యాఖ్యనించారు. వైసీపీ హయాంలో చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఇచ్చాం. టీడీపీ సభ్యులు ఐదుగురు పక్కన కూర్చుంటాం అన్నారని, 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలను లాగేద్దాం అన్నారని, అయితే తాను వ్యతిరేకించి చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చానని స్పష్టం చేశారు.ఇంతమంది సభ్యులుంటేనే ప్రతిపక్ష హోదా అనేది ఎక్కడా లేదని పేర్కొన్నారు. ఎక్కడైనా ప్రభుత్వంలో అధికార పక్షం, ప్రతిపక్షం అనేవి రెండూ ఉంటాయని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడూ అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ మీరే చేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :