Friday, 17 April 2026 09:33:34 AM

నరసింగపురం సర్పంచ్ ను పరామర్శించిన మర్రెడ్డి...

Date : 17 December 2024 08:58 PM Views : 319

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / పిఠాపురం : పిఠాపురం మండల పరిధిలోని నరసింగపురం గ్రామ సర్పంచ్ ను పిఠాపురం నియోజవర్గ జనసేన ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మంగళవారం పరామర్శించారు. వివరాల్లోకి వెళితే నరసింగపురం గ్రామ సర్పంచ్ దెయ్యాల నాగేశ్వరరావు (నాగు)కు నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సర్పంచ్ దెయ్యాల నాగుకు గాయాలు అయ్యాయి. స్థానిక కార్తికేయ హాస్పటల్ నందు చికిత్స అనంతరం నాగేశ్వరరావు (నాగు) తిరిగి ఇంటికి రాగా పిఠాపురం జనసేన ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ సదరు సర్పంచ్ నర్సింగపురం గ్రామంలో గల తన ఇంటి వద్ద కలసి పరామర్శించి ఆయన బాగోగులను అడిగి తెలుసుకున్నారు. మర్రెడ్డితో పాటు జనసేన నాయకులు మురాల శెట్టి సునీల్ కుమార్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, తోలేటి శిరీష, అడపా శివరామకృష్ణ, సలాది సుబ్బారావు, ఓలేటి సాయిరెడ్డి, గంజి గోవిందరాజు, దూలపూడి శ్రీధర్ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :