Friday, 17 April 2026 01:41:25 PM

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దిగజారిపోతున్న పోలీసు వ్యవస్థ ...

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సివిల్ రైట్స్ చైర్మన్ కరణం తిరుపతి నాయుడు

Date : 15 December 2024 06:36 PM Views : 318

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / గుంటూరు జిల్లా : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సివిల్ రైట్స్ చైర్మన్ కరణం తిరుపతి నాయుడు ఆరోపించారు..ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధం లేని వ్యక్తులపై కక్షపురిత దాడులు జరగడం తో రాష్ట్రము లో భయానక వాతావరణం నేలకుంటుందని ఆయన పేర్కొన్నారు. గత వైసిపి ప్రభుత్వం హయం లోకూడా ఇలాంటి దాడులే జరిగాయని, వాటితో ప్రజలు విసిగి వేసారి తెలుగుదేశం ప్రాణభుత్వాన్ని ఎన్నుకుంటే పేనం లోంచి పొయ్యెలో పడ్డ చందం గా పేదల బ్రతుకులు మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. వైసిపి నుండి టిడిపిలో చేరిన వ్యక్తులే ఈ దాడులకు పాల్పడుతున్నట్లు స్పష్టమవుతుంది అని నాయుడు ఆరోపించారు.శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం ఎం అవలింగి గ్రామంలో 2022 -2023 లో ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పద మృతి చెందడం అప్పట్లో సర్వత్ర చర్చనీయాంశం అయింది అన్నారు. గ్రామంలో ఇద్దరు వ్యక్తులు కాల్మని వ్యాపారం వల్ల ఇద్దరు, రాజకీయ కక్షలతో ఒకరు వేధింపుల వల్ల చనిపోవడం బాధాకరం. ఇప్పటివరకు ఈ మరణాల పై పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేపట్టలేదని, అప్పట్లో వైసీపీ పార్టీలో కీలకంగా వ్యవహరించిన సర్పంచ్ అనుచరులు వలన ఐదుగురు చనిపోయారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం వారు వైసీపీ నుండి టిడిపిలో చేరుకోవడం వల్ల వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయబడడం లేదు అని స్పష్టమవుచున్నది. అదేవిదంగా పల్నాడు జిల్లా దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు పాలువాయి బ్రహ్మారెడ్డి అనుచరులు అంగన్వాడీ టీచరును తన విధులకు రాజీనామా చేయాలనీ,అంగన్వాడీ టీచర్ పై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారని తెలిపారు. వీరు అంత టిడిపి పార్టీ కి చెందిన రెడ్డి సామాజిక వర్గం వారు కావడం గమనార్హ మన్నారు. పేదలకు అండగా నిలువవలసిన పోలీసులు అధికార పార్టీ ,అగ్రవర్ణాల వారికి కొమ్ము కాస్తూ, ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యకపోవటం శోచనీయమన్నారు.అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా రౌడీయిజంలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతుందన్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రము లో అనీకం జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడమ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.,ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి డి జి పి స్పందించి రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి అరాచక దాడులపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని తిరుపతినాయుడు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :