Friday, 17 April 2026 01:40:45 PM

వయోవృద్ధుని వైద్యానికి వెస్సో ట్రస్ట్ ఆర్థిక సహాయం...

Date : 18 April 2025 07:12 PM Views : 681

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / తూర్పుగోదావరి జిల్లా : ధవళేశ్వరంకు చెందిన మందరపు సీతారామ్ (67) గతంలో మోటార్ మెకానిక్‌గా జీవనోపాధి సాగించారు. గుండె సంబంధిత సమస్యల కారణంగా వృత్తిని వదిలివేసి రెండు సంవత్సరాల క్రితం ఏంజియోప్లాస్టీ శస్త్రచికిత్స చేయించుకున్నారు. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా అవసరమైన మందులు సకాలంలో వాడలేక పోయారు. దీని ఫలితంగా గతంలో చికిత్స చేసిన రెండు వాల్వులు దెబ్బ తినడంతో పాటు మరో వాల్వ్ కూడా పూర్తిగా పని చేయకుండా పోయింది. దీనివల్ల ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారి అత్యవసరంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఈ పథకం కింద కవర్ కాని అనేక అదనపు ఖర్చులు రావడంతో ఆయన బంధువుల సహాయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన బంధువుల ఇంట్లో అద్దె లేకుండా నివసిస్తున్నారు. రెండు ప్రధాన హృదయ శస్త్రచికిత్సల అనంతరం కూడా అవసరమైన మందులు కొనలేని పరిస్థితిలో ఆయన ఉన్నారు. అంతేగాక, రెగ్యులర్ ల్యాబ్ టెస్టులు చేయించుకోవడం కూడా ఆయనకు సాధ్యం కావడం లేదు! ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన నాయకుల ద్వారా వెస్సో ట్రస్ట్ ను సంప్రదించి బైపాస్ సర్జరీ తర్వాతి చికిత్సకు కావలసిన ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందచేయవలసిందిగా ఆయన కోరగా, వెస్సో ట్రస్టీలు స్పందించి ఆయన వైద్యానికి అర్ధిక సహాయంగా 42,500/-ల రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు బంగారు తాతారావు మాట్లాడుతూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చుల నిమిత్తం ఇబ్బంది పడుతున్న సీతారామ్ కు తమ తమ విరాళాలు అందజేసి ఆపన్న హస్తము అందించిన గౌరవదాతలకు హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :