ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / రాజమహేంద్రవరం : హోటల్ మంజీరాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. అలాగే ఇరుపార్టీలకు చెందిన 12 మంది సమన్వయ కమిటీ సభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణ, ఉమ్మడిగా చేపట్టే కార్యక్రమాలు, కలిసి ముందుకు సాగే అంశాలపై చర్చించనున్నారు.లోకేశ్‌తో పాటు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్య, నిమ్మల రామానాయడు. పితాని సత్యనారాయణ హాజరయ్యారు. ఇక పవన్ కళ్యాణ్‌తో పాటు సమన్వయ కమిటీ సమావేశానికి జనసేన సభ్యులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, కొటికలపూడి గోవిందరావు, బొమ్మిడి నాయకర్, పాలవలస యశస్విని, మహేంద్ర రెడ్డిలు పాల్గొన్నారు. అంతకముందు రాజమండ్రి టీడీపీ క్యాంపు కార్యాలయంలో టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులతో నారా లోకేశ్ సమావేశమై జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించాల్సిన అంశాలుపై చర్చించారు. అనంతరం రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం నుంచి ర్యాలీగా హోటల్ మంజీరాకు లోకేశ్ చేరుకున్నారు. అలాగే రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి ర్యాలీగా హోటల్ మంజీరాకు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఇక భేటీ అయ్యాక లోకేశ్, పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు
Admin
Aakanksha News